Home  »  TV News  »  Illu illalu pillalu :ప్రేమ చేతిలో రాయి.. ధీరజ్ కి కొత్త గర్ల్ ఫ్రెండ్ ముగ్ధ!

Updated : Aug 26, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు Illu illalu pillalu . ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్  562 లో.....రాయి పట్టుకుని రామరాజు ఇంటికి దూసుకొచ్చింది ప్రేమ. రేయ్ ధీరజ్ గా రారా బయటకు అంటూ అరుస్తూ ఇంటి ముందు రచ్చ చేస్తుంది. దీంతో వేదవతి, నర్మద కంగారుగా బయటకు రాగా.. వల్లి మాత్రం కూల్ గా వస్తుంది. ధీరజ్ ఇంట్లో లేడని, వాడు భయపడి దాక్కున్నాడని ప్రేమ ఫైర్ అవుతుంది. ఓన్లీ రణరంగం, రక్తపాతాలే అంటూ డైలాగులు కొడుతుంటే, నర్మద, వేదవతి వస్తారు. నీ పర్సనాలిటీకి ఈ ఆవేశం సూట్ కావట్లేదు.. ఎలకపిల్ల తొడ కొడుతున్నట్లు ఉందంటూ ఇద్దరు కలిసి ప్రేమని ఆటపట్టిస్తారు.

 

ధీరజ్ ఇంట్లో లేడని తెలియగానే.. వాడు దాని బండి మీద తిరుగుతున్నాడా అంటూ రెచ్చిపోతుంది ప్రేమ. ఆ "దాని" ఎవరో కాదు ముద్దపప్పు ముగ్ధ అని ధీరజ్ కొత్త గర్ల్ ఫ్రెండ్ అని ప్రేమ చెప్పడంతో వేదవతి, నర్మద షాక్ అయి నవ్వేస్తారు. వాళ్ళు నవ్వితే నవ్వారని వల్లి కూడా నవ్వడంతో ప్రేమ కోపం వల్లి మీదకు తిరుగుతుంది. నా మొగుడి గురించి నేను పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు, ఎన్ని గొడవలు అయినా మేము మొగుడు పెళ్ళాలమే అంటూ వల్లి చెంప పగలగొడుతుంది. అదే అదునుగా నర్మద .. ఇంత ప్రేమ ఉంటే కలిసిపోరాదా అంటూ ఇద్దరిని కలపాలని చూస్తుంది. మరోవైపు అమూల్య వెంటపడుతున్న విశ్వ చివరకు ఐ లవ్ యూ చెప్పడంతో అమూల్య చెంపచెల్లుమనిపిస్తుంది. తను చచ్చినా ప్రేమిస్తానని ఎమోషనల్ డైలాగులు కొడతాడు విశ్వ. దీంతో అమూల్య.. మా అన్నయ్యలకు చెప్తా అని బెదిరించగానే మాట మార్చేస్తాడు. నేను చెప్పిన డైలాగులే ఇప్పుడు మా చెల్లి ప్రేమ మీ అన్నయ్య ధీరజ్ తో చెప్తుంది.. దాంతో వాళ్ళు కలిసిపోతారని కవర్ చేస్తాడు. విశ్వ ప్లాన్ వర్కౌట్ అయితే తన ప్రేమను ఒప్పుకోవాలని కండిషన్ పెడతాడు.

 

రైస్ మిల్లులో కొట్టేసిన 6 లక్షల లెక్క తేడా నుంచి తప్పించుకోవడానికి వల్లి పెద్ద స్కెచ్ వేస్తుంది. తిరుపతి పుట్టినరోజుని అడ్డం పెట్టుకుని భద్రవతికి ఫోన్ చేసి.. మీ తమ్ముడికి 6 లక్షల గోల్డ్ చైన్ గిఫ్ట్ గా ఇవ్వండి అని రెచ్చగొడుతుంది. రామరాజు ఇంట్లో 25 ఏళ్లుగా ఉంటున్న తిరుపతిని తమ ఇంటికి లాగితే రామరాజుకు దెబ్బ అని నమ్మిస్తుంది. ధీరజ్-ప్రేమలను ఎలా కలపాలా అని నర్మద ఆలోచిస్తుంటే నేను కలపనని సాగర్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.